కేసీఆర్ కు మరోసారి అనారోగ్యం

by Muthe.Rajitha |   (  Updated:2025-08-22 16:29:21  IST  )

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మరోసారి అనారోగ్యానికి గురైనట్టు సమాచారం.

కేసీఆర్ కు మరోసారి అనారోగ్యం
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) మరోసారి అనారోగ్యానికి గురైనట్టు సమాచారం. కేటీఆర్, హరీష్ రావుతోపాటు పలువురు కీలక నేతలు ఎర్రవెల్లి ఫామ్ హౌసుకు వెళ్లి పరామర్శించారని తెలుస్తోంది. అయితే నేడు హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది. 600 పేజీల కాళేశ్వరం నివేదికలోని అంశాలన్నీ కేసీఆర్, హరీష్ రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వినిపిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పీసీ ఘోష్ నివేదికను చర్చించిన అనంతరం చర్యలు తీసుకుంటామని కోర్టుకు తెలిపిన నేపథ్యంలో.. గులాబీ అధినేత మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ అస్వస్థతకు గురై ఉంటారని టాక్ నడుస్తోంది. గతనెలలో కూడా గులాబీ బాస్ అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే.

Next Story