- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలకు KCR దీపావళి సందేశం
by Gantepaka Srikanth |
ప్రజలకు బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రజలకు బీఆర్ఎస్(BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరి జీవితాల్లో చీకట్లు తొలగి ఆనందపు వెలుగు నిండాలని కోరారు. దీపావళి సందర్భంగా ప్రతీ గడపలో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఇంటిల్లిపాది సందడిగా, సంబురంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచిని గుర్తు చేసుకుంటూ దీపావళి (Diwali) పండుగను జరుపుకుంటాం. చిన్న పెద్దా తేడా లేకుండా కొత్తబట్టలు, పిండి వంటలు, కాంతులు విరజిమ్మే టపాసులు, అందమైన దీపాలతో వెలిగిపోయే ఇళ్లతో యావత్ భారతదేశం సంబరాల్లో మునిగిపోతుంది. ఈ పండుగ వేళ దీపాల కాంతుల నడుమ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం ప్రధాన ఆచారం.
Next Story






