బ్రేకింగ్.. యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

by Naga Rani Yarlagadda |

మూడు రోజులక్రితం అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో చేరిన కేసీఆర్.. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్ లోని నివాసానికి చేరుకున్నారు.

బ్రేకింగ్.. యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR Discharge) స్వల్ప అనారోగ్యంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో (Somajiguda Yashoda Hospital) చేరిన విషయం తెలిసిందే. మూడు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్లు విడుదల చేశారు. నీరసంగా ఉండటం వల్లే ఆస్పత్రిలో చేరారని, బ్లడ్ షుగర్ ఎక్కువగా, సోడియం మోతాదు తక్కువగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందన్నారు. ఆయన ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో శనివారం ఉదయం కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్ లోని నివాసానికి బయల్దేరారు. కేసీఆర్ వెంట హరీష్ రావు, సంతోష్ రావు ఉన్నారు. కాగా.. కేసీఆర్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. డాక్టర్లు, అధికారులతో మాట్లాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

Next Story