- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీహార్‌లో ఆసక్తికర సన్నివేశం! సీఎం నితీష్ కుమార్ వద్దన్నా వినని కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ టూర్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ టూర్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. పాట్నాలో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ సీట్లో నుండి లేచి సీఎం కేసీఆర్‌ను పదవెళ్దాం అంటూ తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ మాత్రం విలేకరుల ప్రశ్నలకు సవదానంగా సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో నితీష్ కుమార్ మరోసారి తన స్థానం నుండి లేచి నిల్చున్నారు. విలేకర్ల చక్కర్లో పడవద్దని కేసీఆర్‌తో నితీష్ చమత్కరించారు. అంతటితో ఆగని నితీష్ నిల్చుని సమావేశం ముగిసింది అనేలా సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. దాంతో నితీష్ జీ మీరు కూర్చోండి అంటూ కేసీఆర్ సూచించడంతో ఆయన తిరిగి తన స్థానంలో కూర్చుండిపోయారు. అనంతరం మీడియా ప్రశ్నలకు కేసీఆర్ సమాధానాలు ఇచ్చారు. మీడియాతో మాట్లాడటం నితీష్ వద్దంటే కేసీఆర్ కొనసాగించడం ఆసక్తిని రేపింది.






