- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR: మళ్లీ చురుకుగా.. మూడు బహిరంగ సభలకు కేసీఆర్ నిర్ణయం..!
చాలా రోజుల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాజకీయ రంగంలో చురుకుగా కదలబోతున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: చాలా రోజుల విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ రాజకీయ రంగంలో చురుకుగా కదలబోతున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలో మూడు బహిరంగ సభలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు.ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తొలి సభ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రెండో సభ, మరో కీలక ప్రాంతంలో మూడో సభ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన BRSLP (బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలపై కీలక నిర్ణయాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇవ్వనున్నట్లు సమాచారం. కొంతకాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్, ఇప్పుడు వరుస కార్యక్రమాలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. రేపటి సమావేశం, ప్రకటనలు బీఆర్ఎస్ రాజకీయ వ్యూహానికి కీలక మలుపు కావొచ్చని టాక్ నడుస్తోంది.






