- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డిలో కేసీఆర్ కుట్ర జరుగుతుంది: కేఏపాల్
కామారెడ్డిలో కేసీఆర్ కుట్ర జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కామారెడ్డిలో కేసీఆర్ కుట్ర జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ అన్నారు. కలెక్టర్ కేసీఆర్ తొత్తులా వ్యవహరిస్తుంటే.. ఆయన చెప్పినట్టు పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్ దుర్మార్గంగా ఉందన్న ఆయన.. నేడు బాధిత రైతులకు మద్దతుగా కోర్టు విచారణకు హాజరయ్యారు. మాస్టర్ ప్లాన్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ను అన్నదాతలే గద్దె దింపుతారని అన్నారు.
బీజేపీ, కేసీఆర్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. మాస్టర్ ప్లాన్ కేసులో పార్టీ ఇన్‌పర్సన్‌గా పిటిషన్ వేసి వాదనలు వినిపిస్తానని కేఏపాల్ స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతానన్న ఆయన.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తానని తేల్చిచెప్పారు. 0013168126546 కి తెలుగు రాష్ట్రాల్లో జరుతున్న అవినీతిని డాక్యుమెంట్ల ద్వారా మెసేజ్ చేయాలని కోరారు. ఇంకొక ఆరునెలల తరువాత అవినీతి కుటుంబాన్ని గద్దెదించుతానంటూ సవాలు చేశారు. కాగా, కామారెడ్డి మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ బాధిత రైతులు దాఖలు చేసిన పిటిషన్పై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మాస్టర్ ప్లాన్ ఫైనల్ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది.






