కుంభమేళా మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్​

by Muthe.Rajitha |

కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.

కుంభమేళా మృతులకు సంతాపం తెలిపిన కేసీఆర్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మౌని అమావాస్య సంధర్భంగా ప్రయాగ రాజ్ మహా కుంభ మేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిసలాటలో మరణించడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపధ్యంలో సరియైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Next Story