KCR నన్ను ఎమ్మెల్యే చేయలే.. మేం ఆయన్ను CMను చేశాం: మాజీ ఎమ్మెల్యే గువ్వల హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-13 10:01:28  IST  )

బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజాగా బీజేపీ (BJP)లో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఏకంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)పై విమర్శలు ఎక్కుపెట్టారు.

KCR నన్ను ఎమ్మెల్యే చేయలే.. మేం ఆయన్ను CMను చేశాం: మాజీ ఎమ్మెల్యే గువ్వల హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ నుంచి తాజాగా బీజేపీ (BJP)లో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) ఏకంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR)పై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నాటి నుంచి ఆ పార్టీ సోషల్ మీడియా తనపై దుష్ప్రచారానికి తెర లేపిందని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణలు చేసి, తన పరువు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ (KCR) గెలిపిస్తే తాను ఎమ్మెల్యే కాలేదని.. ప్రజలు ఓటేసి గెలిపిస్తేనే అయ్యానన్నారు. తమ లాంటి వాళ్లనే కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠమెక్కారని కామెంట్ చేశారు. పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న తనను ప్రభుత్వ నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయలేదని అన్నారు. ఎస్సీ బిడ్డనైన తనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెడితే.. బాధ్యతలు మరిచి స్వప్రయోజనాల కోసం వాడుకున్నారని ధ్వజమెత్తారు. తనపై రాజకీయ, అవినీతి ఆరోపణలకు ఆస్కారం లేకపోవడంతోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా (Social Media) వ్యక్తిగత దూషణలకు దిగుతోందని అన్నారు. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని గువ్వల బాలరాజు అన్నారు.

Next Story