- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KCR Birthday Celebrations : కేసీఆర్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరుపుతాం : తలసాని
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు(KCR Birthday Celebrations) ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు(KCR Birthday Celebrations) ఘనంగా నిర్వహిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) పేర్కొన్నారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ బర్త్ డే వేడుకలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్(Telangana Bhavan) లో భారీగా నిర్వహించేందుకు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాట్లకు సంబంధించిన పనులను మాజీ హోంమంత్రి మహమూద్ అలీ(Mahammood Ali)తో కలిసి ఆయన స్వయంగా పర్యవేక్షించారు. రేపు రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో.. పట్టణాలు, గ్రామాల్లో కేసీఆర్ బర్త్ డే వేడుకలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలియ జేశారు. ఆలయలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహిస్తామని.. విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. కేసీఆర్ 71వ జన్మదినం సందర్భంగా 71 కిలోల భారీ కేక్ కటింగ్ చేస్తామని.. వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao), ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha), పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, పార్టీశ్రేణులు హాజరవనున్నారని వెల్లడించారు. అదే విధంగా కేటీఆర్ పిలుపు మేరకు రేపు రాష్ట్రవ్యాప్తంగా వృక్షార్చన పేరుతో ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటే భారీ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహస్తామని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, శ్రేణులు తమతమ నియోజకవర్గాల్లో రేపు మొక్కలు నాటాలని తెలిపారు.






