కేటీఆర్‌కు KCR ఫోన్.. బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేయాలని ఆదేశం

by Gantepaka Srikanth |

భారీ వర్షాల(Heavy Rains) వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆందోళన వ్యక్తం చేశారు.

కేటీఆర్‌కు KCR ఫోన్.. బీఆర్ఎస్ శ్రేణులను అప్రమత్తం చేయాలని ఆదేశం
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల(Heavy Rains) వల్ల వరదలతో రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగడం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల పార్టీ నేతలతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడారు. తమ వంతుగా పార్టీ శ్రేణులు సహాయక చర్యలు చేపట్టేలా చూడాలని, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు ఆదేశించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుండి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివాసాలు నీట మునిగి, రోడ్లు తెగిపోయి రవాణా వ్యవస్థ అతలాకుతలమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాగా, ఇవాళ కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, చెరువుల నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో ఎక్కడికక్కడ రోడ్లు, కల్వర్టులు తెగిపోయాయి. వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. ఇళ్లలోకి నీరు చేరి నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. లో లెవల‌్ వంతెనలపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అధికార యంత్రాంగాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి.

Next Story