కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్

by Ramesh Naini |

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతికించాలని.. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి.. బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కేబీఆర్ పార్క్ చుట్టూ భారీగా చెట్లను నరికివేసే ప్రయత్నాలను వ్యతికించాలని.. హైదరాబాద్ నగరానికి ఊపిరితిత్తుల్లాంటి కేబీఆర్ పార్క్‌ను కాపాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ ప్రభావిత యజమానుల ఫోరం ప్రతినిధులు గురువారం కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేబీఆర్ పార్క్ హైదరాబాద్ నగరానికి అత్యంత విలువైన లంగ్స్ స్పేస్ అని పేర్కొన్నారు. వేగంగా విస్తరిస్తున్న మహానగరంలో పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటంలో పార్కు కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు. ఇలాంటి పచ్చదనాన్ని నాశనం చేసే ఏ చర్యనైనా ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సరైన విధానం కాదని.. సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర ప్రణాళికలతో అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమన్వయం చేయవచ్చని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని.. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Next Story