ఇప్పుడైనా ముఖ్యమంత్రి స్పందిస్తారా? లేదా?: కవిత ట్వీట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-17 13:35:48  IST  )

ఇప్పుడైనా ముఖ్యమంత్రి స్పందిస్తారా? లేదా?: కవిత ట్వీట్

ఇప్పుడైనా ముఖ్యమంత్రి స్పందిస్తారా? లేదా?: కవిత ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మరో గురుకుల విద్యార్థిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బలి తీసుకున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆరోపించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ ఎస్సీ గురుకులంలో 8వ చదువుతున్న సాయి లిఖిత అనారోగ్యం బారిన పడినా సరైన సమయంలో చికిత్స చేయించలేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.. చిన్నారి సాయి లిఖిత ఆరోగ్యం విషమించిన తర్వాత హైదరాబాద్‌కు తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.. ప్రభుత్వ నిర్లక్ష్యం ఆమె తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిల్చింది.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వంద మందికి పైగా గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు మృతిచెందారు. నిత్యం ఫుడ్ పాయిజన్‌తో పదుల సంఖ్యలో విద్యార్థులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వందమందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణం.. ఇకనైనా ముఖ్యమంత్రి స్పందించి గురుకులాల్లో మరో విద్యార్థి బలికాకుండా చర్యలు తీసుకోవాలి.. సాయి లిఖిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు.

Next Story