- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో ఆ బీజేపీ ఎంపీ చిట్టా బయటపెడతా.. కవిత సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ చుట్టూ ద్రోహులు ఉన్నారని కవిత మరోసారి బీఆర్ఎస్‍ను టార్గెట్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ తనను ఏకపక్షంగా బయటకు పంపించిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. నేనెప్పుడు పార్టీ నుంచి బయటకు రావాలనుకోలేదని అందుకోసమే ఎన్నడు కూడా నా బాధను బయట పెట్టలేదన్నారు. కానీ అనివార్య పరిస్థితుల్లో నా బాధను బయట పెడితే నన్ను పార్టీ నుంచి బయటకు పంపిచేశారని దాంతో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి రాజీనామా చేసి జనం ముందుకు వచ్చానన్నారు. జాగృతి జనం బాట యాత్ర సందర్భంగా ఇవాళ నిజామాబాద్‍లో మీడియాతో మాట్లాడిన కవిత.. బీఆర్ఎస్ తో తనది స్ట్రెయిట్ ఫైటింగ్ అని, నన్ను పార్టీ నుంచి బయటకు పంపించి నన్ను సీఎం చేయాలనేది కేసీఆర్ ప్రణాళిక కాదన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న ద్రోహులు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించారని, సమీక్షలు జరిగి ఉంటే బీఆర్ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయేది కాదన్నారు.
ఆ ఎంపీ చిట్టా బయట పెడతా:
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) ఉన్నా లేనట్టేనని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో నిజామాబాద్‍లో ‘కే’ ట్యాక్స్ నడుస్తుందని అర్వింద్ ఆరోపిచారు. మరి ఇప్పుడు మీ ట్యాక్స్ నడుస్తోందా అర్వింద్ అంటూ కవిత ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని అర్వింద్ రాజీనామాతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ మైనారిటీ గవర్నమెంట్ నడుస్తోందని మీరు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తున్నాయన్నారు. తాను జనం బాట యాత్ర ప్రారంభించగానే నాపై నా కుటుంబంపై ఓ బీజేపీ ఎంపీ లేని పోని ఆరోపణలు చేశారని త్వరలోనే ఆయన అవినీతి చిట్టా అంతా మీడియా ముఖంగా బయటపెడతానన్నారు.
కాంగ్రెస్ తో మాకు పనిలేదు:
కాంగ్రెస్ కే దిక్కులేదని నాకు ఏం సపోర్టు చేస్తారని విమర్శించారు. అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాన్ని నిలుపుకోలేకపోతోందని ఆరోపించారు. కాంగ్రెస్ మునిగిపోయే పడవలాంటిదని దానితో మాకు పని లేదన్నారు.






