- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పాపంలో నాకు భాగస్వామ్యం నన్ను క్షమించండి.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాలో కవిత
బీఆర్ఎస్ హయాంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయినందుకు కవిత క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ కీలక డిమాండ్లు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఉండదని కలలుగంటే రాష్ట్రం వచ్చాక అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపించాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక కొన్ని శాఖల్లో పర్మినెంట్ ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మారారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో మార్పు తేలేకపోయినందుకు మీ సోదరిగా శిరస్సు వంచి క్షమాపణ కోరుతున్నానన్నారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను కూడా ఉన్నానని ఆ పాపంలో తనకు కూడా భాగస్వామ్యం ఉంటుందని అందువల్ల క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఇవాళ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మహాధర్నాలో (Outsourcing Employees Protest) పాల్గొని మాట్లాడిన కవిత.. తమ సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోకపోవడం వల్లే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు డిక్లేర్ చేసి మరీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వానికి రెండు రోజుల గడవు:
కేసీఆర్ పాలనలో ధర్నాచౌక్ ఎత్తివేస్తే మేము వచ్చాక ధర్నా చౌక్ వద్ద అనుమతి ఇస్తామని కాంగ్రెస్ చెబితే ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచిస్తున్నారని అనుకున్నాం. కానీ ధర్నాచౌక్ ఇస్తాం మీ ఇష్టం ఉన్నన్నాళ్లు ధర్నాలు చేసి చావండి మేము మాత్రం స్పందించం అన్నట్లు కాంగ్రెస్ వ్యహరిస్తోందని ధ్వజమెత్తారు. నాడు ధర్నా చౌక్ లేకపోతే ఇప్పుడు ధర్నా చౌక్ ఉండి ఏం లాభం అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పోరాటం చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మిలియన్ మార్చ్ తరహాలో హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేసేందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రణాళిక చేయాలన్నారు. అలా చేస్తే ప్రభుత్వం దిగి వచ్చి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వక తప్పదన్నారు. 9 ఏజెన్సీలకు ఔట్ సోర్సింగ్ లాభాలు వెళ్తోందని ఆరోపించారు. భవిష్యత్ లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండొద్దనేది తెలంగాణ జాగృతి లక్ష్యం అన్నారు. ప్రభుత్వానికి రెండు రోజుల గడువు ఇస్తున్నామని అన్ని శాఖల్లో దళారులు, మధ్యవర్తులు లేకుండా నేరుగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా కార్పొరేషన్ లేదా జీవోలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.






