- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.. రంగనాథ్ తొలగింపు ఆదేశాలపై కవిత రియాక్షన్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్‍ను తప్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. హైడ్రా కమిషనర్‍ను తొలగించాలని హైకోర్టు ఆదేశించడం రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తేటతెల్లం చేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేసిన కవిత.. అక్రమ కట్టడాల పేరుతో పేదల నివాసాలను ఇష్టారాజ్యంగా కూల్చివేసిన ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అన్నారు. న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్‌కు ఆదేశిస్తామని హైకోర్టు హెచ్చరించినా హైడ్రా తీరు మారలేదని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని పెద్ద వాళ్లకు ఒక న్యాయం, పేద వాళ్లకు ఒక న్యాయం అనే విధంగా కాకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఓ ప్రైవేట్ భూమి విషయంలో హైకోర్టు ఆదేశాలు ఉన్నా రంగనాథ్ వాటిని ఉల్లంఘించారని అలాగే ఆయనపై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని అన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతడిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కవిత వర్సెస్ రంగనాథ్:
కాగా ఇటీవల హైడ్రాకు కవితకు మధ్య బిగ్ ఫైట్ నడిచింది. రేవంత్ రెడ్డి వచ్చాక హైడ్రా అనే మహమ్మారిని తీసుకువచ్చారని కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇటీవల తాము గండిపేట మండలం నార్సింగ్‌లో ఓ ప్రైవేట్ సంస్థ మూసీ నది మధ్యలో నిర్మాణాలు చేపడుతుంటే ఆందోళన చేస్తే హైడ్రా మమ్మల్నే బద్నాం చేయాలని చూస్తోందని కమిషనర్ రంగనాథ్ తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో మిస్టర్ రంగనాథ్ మిమ్మల్ని మేము కోర్టుకు ఈడిస్తామంటూ గతంలో హెచ్చరించారు. అయితే తాజాగా హైకోర్టు రంగనాథ్ ను తొలగించాలని ఆదేశించిన నేపథ్యంలోపై స్పందించారు.






