- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gangula kamalakar : కవిత పార్టీ పెట్టడం ఊహాగానాలే : క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కొత్త పార్టీ పెడుతుందనే వార్తలను కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gnagula Kamalakar).

దిశ, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) కొత్త పార్టీ పెడుతుందనే వార్తలను కొట్టిపారేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gnagula Kamalakar). ఆదివారం ఆయన కవిత కొత్త పార్టీ(Kavitha New Party) పెడతారనే ఊహాగానాలపై స్పందిస్తూ.. ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనని క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెట్టినపుడు మాట్లాడతానని అన్నారు. బీఆర్ఎస్(BRS)కు ఎప్పటికీ కేసీఆర్(KCR) మాత్రమే నాయకుడని స్పష్టం చేశారు. కవిత కేసీఆర్‌కు రాసిన లేఖ ద్వారా బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలను బయటపడ్డాయని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తూ.. కవిత కొత్త పార్టీ పెడతారంటూ తీవ్ర చర్చలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కమలాకర్ మాట్లాడుతూ.. కవిత బీఆర్ఎస్‌లోనే కొనసాగుతారని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ఈ ఊహాగానాలను రాజకీయ లబ్ధి కోసం వాడుతోందని విమర్శించారు. కవిత లేఖలో కేసీఆర్‌పై విమర్శలు చేయడం, బీజేపీతో రహస్య ఒప్పంద ఆరోపణలు చేయడం వంటివి బీఆర్ఎస్ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నప్పటికీ ఆమె బీఆర్ఎస్‌కు విధేయురాలని పేర్కొన్నారు.






