- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ స్కామ్ పక్కదారి పట్టించేందుకు కవిత కొత్త గేమ్: ప్రొ. గాలి వినోద్
లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: లిక్కర్ స్కామ్‌ను పక్కదారి పట్టించేందుకు కల్వకుంట్ల కవిత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని దక్షిణ భారత సమితి కన్వీనర్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత పార్లమెంట్ మెంబర్‌గా పనిచేసిన సమయంలో ఏనాడు మహిళా రిజర్వేషన్ గురించి ప్రస్తావించలేదన్నారు. కానీ ఆకస్మికంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ నెల10న ధర్నా నిర్వహిస్తా అని ప్రకటించడం విచిత్రంగా ఉన్నదన్నారు. లిక్కర్ స్కామ్ నుండి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ తొలి మంత్రివర్గంలో మహిళలకు చోటు ఇవ్వనప్పుడు నోరు మెదపని కవిత ధర్నాచేస్తానని చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,అన్యాయాలు, అవమానాలు, హత్యలు, ఆత్మహత్యలపై కవిత ఎన్నడూ ప్రశ్నించలేదన్నారు. తొమ్మిదేళ్లు మహిళా రిజర్వేషన్ల గురించి అటు ఢిల్లీ ఇటు తెలంగాణ గల్లీలోనూ మాట్లాడలేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో తాను అరెస్ట్ అవుతానని కవితకు భయం పట్టుకున్నదన్నారు. దీంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు అనే కొత్త నాటకం తెరపైకి తెచ్చారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ, పార్లమెంటులో 50 శాతం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.






