- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా జాగృతి పోరాటం: కవిత కీలక ప్రకటన
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక ప్రకటన చేశారు. పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు అర్హత లేదని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై సోమవారం కవిత తెలంగాణ జాగృతి ఎక్స్ ఖాతా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలంగాణ పెను నష్టం వాటిల్లే ప్రమాదం
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాపాడలేదని మరోసారి స్పష్టం అయిందని విమర్శించారు. నీటి పంపకాల విషయంలో పొరుగు రాష్ట్రాలతో పేచీలు పెట్టుకోవడం ఇష్టం లేదన్న ఈ ముఖ్యమంత్రి చేతగాని మాటలు న్యాయ పోరాటంలోనూ ప్రతిఫలించడం తెలంగాణ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని తెలిపారు. ఏపీ ప్రభుత్వం కేంద్ర సర్కారు అండతో అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం - నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు పై విచారణ అర్హత లేని పిటిషన్ వేసి రాష్ట్రం హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందన్నారు.
నీటి సోయి లేని ముఖ్యమంత్రి, ప్రభుత్వంలోని ఇతర ముఖ్యుల వల్ల తెలంగాణ నీటి హక్కులను పెను నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని, తెలంగాణ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.






