- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కవిత అక్క కాదు.. కవిత అమ్మ’ అంటూ ప్రమోట్
రాష్ట్ర రాజకీయాల్లో కవిత కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చారు. పాంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ తన ప్రసంగంతో కొత్త చర్చకు తెరతీశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో కవిత కొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చారు. పాంచజన్యం పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ తన ప్రసంగంతో కొత్త చర్చకు తెరతీశారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలతో నేరుగా కనెక్ట్ కావాలని, తమ రాజకీయ ఆలోచనలను విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తున్నది. పార్టీ ఆవిర్భావ సభలో కవిత ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నది. ప్రధానంగా ఆమె అన్ని వర్గాల ప్రజలను ఆకర్శించేలా సామాన్యుల సమస్యల నుంచి మహిళలు, యువత, రైతులు వరకు ప్రతి వర్గానికి సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. దీంతో ఆమె స్పీచ్‌పై విస్తృతంగా చర్చ నడిచింది. అయితే.. ఇదే ప్రసంగంలో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్‌పై విమర్శల బాణాలు సంధించడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. గత పాలనలో జరిగిన నిర్ణయాలు, విధానాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ కవిత తన దూకుడు చూపించారు.
ఇక కవితమ్మ..
అటు.. ప్రచార శైలిలోనూ కవిత టీమ్ పలు మార్పులు తీసుకొచ్చింది. ముఖ్యంగా తెలంగాణ జాగృతి అఫిషియల్ ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్ నిన్నటివరకు కవితక్క పేరుతో ఉండగా.. దానిని పార్టీ ప్రకటన అనంతరం కవితమ్మగా మార్చేశారు. ఈ మార్పు ద్వారా మరింత భావోద్వేగ అనుబంధం ఏర్పరచుకోవాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తున్నది. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మొత్తానికి పాంచజన్యం హామీలతో కవిత ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశమున్నది. ఈ స్ట్రాటజీ ఎంతవరకు ఫలిస్తుంది, ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
కవిత ప్రకటించిన 5 హామీలు ఇవే..
పార్టీ ఆవిర్భావ సభలో కవిత పాంచజన్యం పేరుతో ఐదు కీలక హామీలను ప్రకటించారు.
విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఉచిత విద్య.
వైద్యం: ఏ రోగమొచ్చినా సరే ఏ ఆస్పత్రిలోనైనా పూర్తిగా ఉచితవైద్యం.
వ్యవసాయం: రైతేరాజు నినాదాన్ని నిజం చేస్తాం.
ఉపాధి: యువతకు రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు. తొలి ఏడాదే సింగిల్ నోటిఫికేషన్‌తో 4 లక్షల ఉద్యోగాలు. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ పోస్టులు.
సామాజిక న్యాయం: కచ్చితంగా సాధించి తీరుతామని హామీ ఇచ్చారు.






