Kavitha: ఆ కీలక నేత అవినీతి బయటపెట్టిన కవిత అభిమానులు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ నేత లీలలపై హింట్.. ఎక్స్ లో పోస్టు వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-09-04 12:55:23  IST  )

తెలంగాణ రాజకీయాల్లో కవిత వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది.

Kavitha: ఆ కీలక నేత అవినీతి బయటపెట్టిన కవిత అభిమానులు.. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ నేత లీలలపై హింట్.. ఎక్స్ లో పోస్టు వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ లో అడ్వాన్స్ గా పొలిటికల్ క్రాకర్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇన్నాళ్లు కలిసి మెలిసి నడిచిన నేతలంతా కవిత ఎపిసోడ్ పరస్పర విమర్శలతో పటాకుల మోత మోగిస్తున్నారు. మీది రాంగ్ ఎజెండా అంటే కాదు మీదే తప్పుడు రూట్ అంటూ ఒకరిపై మరొకరు మాటల కత్తులు దూసుకుంటున్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కవిత (Kavitha) ఆపార్టీ నేతలు నేతలు హరీశ్ రావు, సంతోష్ రావు (Santosh Rao) అవినీతి అనకొండలు అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కవిత అభిమానులు వర్సెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో వార్ నుడుస్తుండగానే తాజాగా బీఆర్ఎస్ నేత ఒకరు ట్రాక్టర్లతో ఏకంగా రూ. 120 కోట్లు నొక్కెశారని కవిత మద్దతుదారులు సోషల్ మీడియాలో పోస్టు చేయడం సంచలనంగా మారింది. పరోక్షంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంతోష్ రావును ఉద్దేశించే అనే చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది.

బెంగళూరు టు వరికోల్ వయా హ్యాపీ రావు:

హరీశ్ రావు, సంతోష్ రావు మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నిన్న కవిత ఆరోపించారు. అంతే కాదు కేసీఆర్ హరితవనం పేరుతో కార్యక్రమం చేస్తే దాన్ని గ్రీన్ చాలెంజ్ పేరుతో హరీశ్ రావు హైజాక్ చేశారని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన 24 గంటలు గడవక ముందే ఓ నేత రూ. 120 కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ సంచలన పోస్టు 'కవితక్క అప్ డేట్స్' పేరుతో ఉన్న ఎక్స్ ఐడీలో షేర్ కావడం కలకలం రేపుతోంది. ఈ పోస్టు లోని వివరాల ప్రకారం.. 'కేసీఆర్ మహాత్మా గాంధీ స్ఫూర్తితో పల్లెప్రగతి అనే అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తే హ్యాపీ రావు (Happy Rao) కన్ను ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చే ట్రాక్టర్లపై పడింది. దాంతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వరికోల్ గ్రామానికి చెందిన కోడిపందాలు చేసే క్లాస్ ఫ్రెండ్ తో రూ.120 పైగా కోట్ల కమిషన్ కోసం హ్యాపీ రావు స్కెచ్ వేశాడు. అప్పటికే ఆ బినామికి ట్రాక్టర్‌కి సంబంధించిన బిజినెస్ చేసిన అనుభవం ఉండటం వల్ల బెంగళూరులో ట్రాక్టర్ కంపెనీలను పిలిపించుకుని ఒక్కో ట్రాక్టర్‌కు లక్ష రూపాయిలు ఇవ్వాలనే ఒప్పందం కుదిరించుకున్నారు. ఈ ఒప్పందంలో అప్పటి సంబంధిత శాఖ మంత్రిని దయ లేకుండా పక్కన పెట్టి, అతనికి వాటా ఇవ్వలేదు. ఆ మంత్రి కావాలని గట్టిగా అడగగా, అతనికి ఒక ఖరీదైన కారు ఇంటికి పంపించారు. ఆ తర్వాత ఆ కారుకు ఈఎంఐ కూడా కట్టలేదు. హ్యాపీ రావు వల్ల ఇప్పటికీ ఆ సదరు మాజీ మంత్రి అవసరం లేని ఆ కారుకు తన సొంత డబ్బులతో ఈఎంఐ కట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చారు. ఆ 120కి పైగా కోట్లు ఇద్దరూ పంచుకుని ఆ మంత్రికి మాత్రం మొండి చేయి చూపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆ ఇద్దరు నాయకులకు కొన్ని రోజులు మాటలు లేకపోయాయని ఈ మధ్యనే కుట్టుమిషన్లు పంచుతున్నారు' అని పోస్టు చేశారు. ఈ పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది.

నెక్స్ ఆ నేత లీలల ఎపిసోడ్:

కవితక్క అప్ డేట్స్ ఎక్స్ ఖాతా హ్యాపీ రావు విషయం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బయట పెడతానని ఇవాళ ఉదయమే ప్రకటించగా ఆ మేరకు పై వివరాలతో పోస్టు చేశారు. అయితే కవితక్కపై విమర్శలు చేసే నేతలను ఈ ఐడీ టార్గెట్ చేయబోతున్నట్లు స్పష్టం అవుతోంది. వరుసగా 15 రోజుల సీరీస్ రూపంలో ఒక్కొక్క నేత అవినీతి చిట్టా బహిర్గతం చేసే ప్లాన్ తో ఉన్నట్లు సదరు ఐడీలో పోస్టులను బట్టి తెలుస్తోంది. ఇన్నాళ్లు కవిత వెంట నడిచిన మేడే రాజీవ్ సాగర్ ఇవాళ కవితపై విమర్శలు చేశారు. తాను కేసీఆర్ వెంట నడుస్తున్నట్లు ప్రకటించారు. అలాగే తమకు చెప్పకుండా కవిత నిర్ణయం తీసుకోవడం పట్ల విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో కవితక్క అప్ డేట్స్ ఐడీ రాజీవ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా రియాక్ట్ అయింది. 'మాట్లాడుకుందాం..15 రోజుల సిరీస్ లో రాజీవ్ లీలు కూడా ఉన్నాయి' అంటూ అప్ డేట్ ఇచ్చింది. దీంతో రాజీవ్ లీలలు ఏంటి? మేడే రాజీవ్ సాగర్ ను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టారా అనేది సస్పెన్స్ గా మారింది.

Next Story