- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు రాఖీ కట్టని కవిత.. పండుగ వేళ ఎందుకీ ఎడబాటు?
రాష్ట్రమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటుండగా.. ప్రతీ రాఖీకి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెళ్లు మాత్రం దూరంగా ఉన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రమంతా రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటుండగా.. ప్రతీ రాఖీకి తమ అనుబంధాన్ని చాటే అన్నా చెల్లెళ్లు మాత్రం దూరంగా ఉన్నారు. ప్రతి ఏటా అన్నకు క్రమం తప్పకుండా రాఖీ కట్టే చెల్లెమ్మ.. ఈ సారి ఎడబాటును చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కేటీఆర్ - కవితల మధ్య ఏ ఏడాది లేనంత దూరం పెరిగినట్లు కనిపిస్తోంది.
రాఖీ పౌర్ణమి (Rakhi 2025) సందర్భంగా.. అన్నకు రాఖీ కట్టేందుకు వస్తానంటే తాను హైదరాబాద్ లో లేనని, కలవలేనని చెప్పినట్లుగా కవిత (Kavitha) సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. రాఖీ సెలబ్రేషన్స్ గురించి కొందరు విలేకరులు ఆమెను అడగ్గా.. అన్న కేటీఆర్ (KTR) బెంగళూరులో ఉన్నట్లు చెప్పారని, ప్రస్తుతం తాను హైదరాబాద్ లో అందుబాటులో లేనని మెసేజ్ పెట్టారని తెలిపారు. అందుకే రాఖీ వేళ అన్నకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు. కేటీఆర్ బెంగళూరులో ఉండటమే ఇందుకు కారణమా? లేక కొన్నాళ్లుగా పార్టీ పరంగా నెలకొన్న విబేధాలు కారణంగా నిలిచాయా ? అని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.






