- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాగృతి నాయకురాలి ఇంటికి వెళ్లి పరామర్శించిన కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కొద్దిరోజులుగా గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కొద్దిరోజులుగా గ్యాప్ లేకుండా పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో పర్యటించిన కవిత ప్రస్తుతం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు ఆమె జాగృతి పార్టీ నాయకులు కవిత కాలిగాయంతో బాధపడుతుండటంతో కవాడిగూడలోని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు ధైర్యం చెప్పి అనంతరం అక్కడ నుండి బయలు దేరారు. అనంతరం అక్కడ నుండి హైదరాబాద్ కార్వాన్ అసెంబ్లీ నియెజకవర్గం పరిధిలోని బాపూ ఘాట్‌ను సందర్శించి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. ఇక కవిత కొంతకాలంగా రాజకీయాల్లో చాలా చురుకుగా ఉంటున్న సంగతి తెలిసిందే. తరచూ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. మరోవైపు ప్రజలకు సైతం దగ్గరయ్యేలా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో రేపో మాపో కవిత తెలంగాణ జాగృతిని పార్టీగా ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది.






