గాజులరామారం బస్తీలో కవిత పర్యటన.. బాధితులకు పరామర్శ

by Kema Shiva Kumar |

గాజులరామారం బస్తీలో కవిత పర్యటన.. బాధితులకు పరామర్శ
X

దిశ, వెబ్‌డెస్క్: నగరంలో మరోసారి హైడ్రా పంజా విసిరింది. కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారంలోని సర్వే నెంబర్ 307లో అక్రమ కట్టడాలను ఆదివారం కూల్చివేసింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలు కొనసాగాయి. ఈ క్రమంలోనే కూల్చివేతలు వెంటనే ఆపాలని స్థానికులు హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ ఇళ్లను కూల్చి వేస్తున్నారని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు. దేవేందర్ నగర్, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలలో వందలాది ఇళ్లను అధికారులు నేలమట్టం చేశారు. అదేవిధంగా అక్కడ ప్రభుత్వ భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు హైడ్రా అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గాజులరామారంలోని గాలి పోచమ్మ బస్తీలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. ఈ మేరకు ఇండ్లు కోల్పోయిన బాధితులతో మాట్లాడారు. కనీసం నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేయడం దారణమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story