- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC Kavitha : తెలంగాణ డీజీపీ ఆఫీసుకు కవిత.. సీఎం చర్యలు తీసుకోవాలని డిమాండ్
తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలంగాణ డీజీపీ ఆఫీసుకు చేరుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna)పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) తెలంగాణ డీజీపీ ఆఫీసుకు చేరుకున్నారు. మల్లన్న గన్‌మెన్స్ ఎందుకు కాల్పులు చేయాల్సి వచ్చిందనేని తెలియాలని కోరారు. మల్లన్న ఆదేశాలు లేకుండా గన్‌మెన్స్ కాల్పులు చేయరని, జాగృతి కార్యకర్తలపై కాల్పులు జరిపిన గన్‌మెన్స్ ను వెంటనే డిస్మిస్ చేయాలని డీజీపీని కోరనున్నారు. మల్లన్న మాట్లాడిన మాటలకు మా వాళ్ళకు కోపం వచ్చి నిరసన తెలపడానికి వెళ్లారని, ఇంత మాత్రనికే గన్ ఫైర్ చేసి చంపేస్తారా? అని కవిత మండిపడ్డారు.
తీన్మార్ మల్లన్న బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే కుదరదని, ఆయన చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. లేదంటే ఐ వ్యాఖ్యల వెనక సీఎం ఉండి మాట్లాడించారని భావించాల్సి ఉంటుందని కవిత తెలియజేశారు.






