- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాలినడకన తిరుమలకు కల్వకుంట్ల కవిత..ఎప్పుడంటే !
కాలినడకన తిరుమల శ్రీవారి మొక్కు చెల్లించుకోనున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.

*కాలినడకన తిరుమల కల్వకుంట్ల కవిత*
*ఈ నెల 6వ తేదీన తిరుమల శ్రీవారి దర్శనం*
దిశ, వెబ్ డెస్క్: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత యాక్టివ్ పాలిటిక్స్ లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. గులాబీ పార్టీ పై విమర్శలు చేస్తూనే.. అటు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బీసీ నినాదాన్ని జనాల్లోకి తీసుకు వెళ్తూ, సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అలాంటి కల్వకుంట్ల కవిత, తిరుమల షెడ్యూల్ ఖరార్ అయింది. ఈ నెలలో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు కల్వకుంట్ల కవిత కుటుంబ సభ్యులు.
కాలినడకన తిరుమలకు కల్వకుంట్ల కవిత
ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత తిరుమల పర్యటనకు వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారి మొక్కు చెల్లించుకోనున్నారు కవిత. ఈనెల 5వ తేదీన తిరుపతికి చేరుకుంటారు. ఆ తర్వాత అలిపిరి మెట్ల ద్వారా తిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకుంటారు కల్వకుంట్ల కవిత. ఇక ఆరవ తేదీన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి బయటపడ్డ కల్వకుంట్ల కవిత... ఇప్పుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం హాట్ టాపిక్ గా మారింది. క్లిక్






