పార్టీ నుంచి కవిత సస్పెండ్.. జాగృతి నేతల రియాక్షన్ ఇదే

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-02 10:19:43  IST  )

బీఆర్ఎస్ నుంచి కవిత (Kavitha) సస్పెండ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

పార్టీ నుంచి కవిత సస్పెండ్.. జాగృతి నేతల రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుంచి కవిత (Kavitha) సస్పెండ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ నుంచి బహిష్కరణపై అధికారిక ప్రకటన వెలువడగానే జూబ్లీహిల్స్‌లోని జాగృతి ప్రధాన కార్యాలయానికి నేతలు భారీగా చేరుకుంటున్నారు. ‘జై కవితక్క.. జై జాగృతి’ అంటూ కార్యకర్తల నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా మాజీ మంత్రులు హరీష్‌ రావు (Harish Rao), జగదీశ్ రెడ్డి (Jagadeesh Reddy)కి వ్యతిరేకంగా ప్లకార్డులను ప్రదర్శిస్తూ హల్‌చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత సస్పెన్షన్‌పై జాగృతి నేతలు మాట్లాడుతూ.. కవితను పార్టీ నుంచి బహిష్కరించినంత మాత్రమా ఆమెకు ఎలాంటి నష్టం జరగబోదని కామెంట్ చేశారు.

కన్నతండ్రి కేసీఆర్‌ (KCR)పై సీబీఐ (CBI) విచారణను ఆమె తట్టుకోలేకపోయాదని అన్నారు. అయినా.. చాలా రోజులుగా నుంచి కవితను పార్టీకి దూరం పెట్టే కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. కవిత ఏ నిర్ణయం తీసుకున్నా తాము ఆమె వెంటే ఉంటామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజల కోసం కవితక్క కొట్లాడుతుందని, సామాజిక తెలంగాణ కోసమే కవిత అక్క ఫైట్ చేస్తోందని అన్నారు. రాబోయే రోజుల్లో బడుగు బలహీన వర్గాల ప్రజలు మొత్తం ఆమె వెంటే ఉంటారని కామెంట్ చేశారు. కాగా మరోవైపు ఎమ్మెల్సీ కవిత తాజాగా పరిణామాలపై సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ పదవితో పాటు ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసకున్నట్లుగా తెలుస్తోంది. కాసేపట్లో కవిత మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read More..

BRS : కవిత సస్పెండ్ ఎఫెక్ట్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు..

Next Story