బీసీ బంద్‌లో పాల్గొన్న కవిత కుమారుడు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-18 04:44:16  IST  )

బీసీ సంఘాల బంద్ పిలుపులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో మాన‌వహారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నాడు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశాడు.

బీసీ బంద్‌లో పాల్గొన్న కవిత కుమారుడు
X

దిశ, వెబ్ డెస్క్: బీసీ సంఘాల బంద్ పిలుపులో భాగంగా తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత ఖైర‌తాబాద్ చౌర‌స్తాలో మాన‌వహారం కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆమె కుమారుడు ఆదిత్య సైతం పాల్గొన్నాడు. బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్లు ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశాడు. కేవ‌లం మా అమ్మ మాత్ర‌మే పోరాటం చేస్తే స‌రిపోదు అని ప్ర‌తి ఇంటి నుండి అంద‌రూ బ‌య‌ట‌కు వ‌చ్చి రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడాల‌ని అన్నాడు. బీసీ రిజ‌ర్వేష‌న్లు స్థానిక ఎన్నిక‌ల‌కు అవ‌స‌రం అని అన్నారు. ఇదిలా ఉంటే క‌విత కుమారుడు మొదటిసారి ఇలాంటి కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. విదేశాల్లో చ‌దువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు వ‌చ్చాడు.

Read More..

పదే పదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి: కవిత

Next Story