కార్యకర్తలను కలవకుండా కార్తీకదీపం.. కేటీఆర్‌పై కవిత సోషల్ మీడియా ట్రోలింగ్

by Ajay Maddhiboyina |

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌ను కార్తీక దీపం సీరియల్‌ను సాగదీసినట్టు సాగదీస్తున్నారని వ్యాఖ్యానించారు.

కార్యకర్తలను కలవకుండా కార్తీకదీపం.. కేటీఆర్‌పై కవిత సోషల్ మీడియా ట్రోలింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సిట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌ను కార్తీక దీపం సీరియల్‌ను సాగదీసినట్టు సాగదీస్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా ఇప్పుడు కవితకు సంబంధించిన సోషల్ మీడియా కేటీఆర్‌పై ట్రోల్స్ చేస్తోంది. సిట్ నోటీసులు ఇస్తే కార్యకర్తలను కలవకుండా కేటీఆర్ కార్తీకదీపం సీరియస్ చూస్తున్నారని మీమ్స్ క్రియేట్ చేస్తోంది. అంతే కాకుండా ఈ నోటీసుల వెనక ఉంది ఓ గుంట నక్క అని ఆ నక్కకు బీఆర్ఎస్ పార్టీ పగ్గాలు కావాలని పోస్టులు పెడుతోంది.

అందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని కామెంట్ చేస్తోంది. కేటీఆర్ పార్టీ పదవుల నుండి దిగిపోతే ఏ నోటీసులు ఉండవని ప్రచారం చేస్తోంది. గతంలో కవిత చేసిన వ్యాఖ్యలను సైతం గుర్తు చేస్తూ వీడియోలు షేర్ చేస్తోంది. ఓ వీడియోలో కవిత మాట్లాడుతూ తనకు వచ్చిన పరిస్థితే పార్టీలోని ఇతరులకు కూడా వస్తుందని అన్నారు. తనను కుట్ర చేసి బయటకు పంపారని మిగితావాళ్లను కూడా బయటకు పంపి పార్టీని హస్తగతం చేసుకుంటారని చెప్పారు. జాగృతి సోష‌ల్ మీడియా ఇలా పోస్టులు చేస్తుంటే బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా వారికి కౌంట‌ర్లు వేస్తోంది.

Next Story