24 గంటల ముందే రాఖీ కడదామని రామన్నకు మెసేజ్ చేశా..కానీ: కవిత

by Ajay Maddhiboyina |

బీఆర్ఎస్ నుండి స‌స్పెండ్ చేసిన త‌ర‌వాత క‌విత మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా హ‌రీష్ రావు, సంతోష్ రావుల‌పై అనేక ఆరోప‌ణ‌లు చేశారు.

24 గంటల ముందే రాఖీ కడదామని రామన్నకు మెసేజ్ చేశా..కానీ: కవిత
X

దిశ‌, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (brs party) నుండి స‌స్పెండ్ చేసిన త‌ర‌వాత క‌విత (kavitha) మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ పై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా హ‌రీష్ రావు, సంతోష్ రావుల‌పై అనేక ఆరోప‌ణ‌లు చేశారు. ఆ ఇద్ద‌రి కుట్ర వ‌ల్ల‌నే తన‌ను బ‌హిష్క‌రించిన‌ట్టు తెలిపారు. నాన్న జాగ్ర‌త్త‌, రామన్నా ఆ ఇద్ద‌రితో జాగ్ర‌త్త అంటూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక మీడియా సమావేశంలో తాను కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేకపోయారో వివరించారు.

24 గంటల ముందే కేటీఆర్‌కు తాను వస్తానని మెసెజ్ చేసినట్టు తెలిపారు. మీడియా లేకుండానే రాఖీ కట్టేందుకు వస్తానని చెప్పానన్నారు. కానీ రామన్న ఏదో బిజీగా ఉండి ఎక్కడికో వెళ్లారని, అది అర్థం చేసుకుని సైలెంట్ గా ఉన్నానని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్‌తో తనది రక్త సంబంధం అని పార్టీలు పోతేనో, పదవులు పోతేనో విడిపోయే బంధం కాదని చెప్పారు. బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకోవడానికే తనను ఎలిమినేట్ చేశారని చెప్పారు. రేపు కేటీఆర్ కావచ్చు, ఎల్లుండి కేసీఆర్ కావచ్చు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Next Story