- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: సొంత బావ ఫోన్ ట్యాప్ చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ పై కవిత సెన్సేషనల్ కామెంట్స్
బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు, ఉద్యమకారులు అసంతృప్తితో ఉన్నారని వారంతా నాతో టచ్‌లోకి వచ్చారని కవిత అన్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త ఫోన్ ట్యాప్ చేశారని, సొంత బావ ఫోన్ ను ఎవరైనా ట్యాప్ చేస్తారా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) వార్త వినగానే కడుపులో దేవినట్లైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఇవాళ కరీంనగర్‍లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత బీఆర్ఎస్‍లో చాలా అవమానాలు జరిగాయన్నారు. అన్యాయం జరిగితే భరించేదాన్ని కానీ అవమానాన్ని భరించలేకే ఆత్మగౌరవం కోసమే బయటకు వచ్చానన్నారు. బీఆర్ఎస్ లో చాలా మంది నేతలు అసంతృప్తిలో ఉన్నారని నేను బీఆర్ఎస్ ను వీడాక ఆ పార్టీ నేతలు నాకు టచ్ లోకి వచ్చారని చెప్పారు. జనంబాటలో పాత బీఆర్ఎస్ క్యాడర్ నాతో మాట్లాడుతున్నారని చెప్పారు.
బీఆర్ఎస్ చిక్కులు తప్పవా?:
గత ప్రభుత్వం అక్రమంగా ఫోన్ ట్యాపింగ్‍కు పాల్పడిందనే అంశం సంచలనం రేపుతోంది. ఈ విషయంలో ఇప్పటికే సిట్ విచారణ జరుపుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ పై గతంలో అంతగా మాట్లాడని కవిత ఇవాళ ఏకంగా ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని దృవపరిచేలా బీఆర్ఎస్ హాయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ కామెంట్ చేయడం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కుటుంబ సభ్యుల ఫోన్లను సైతం ట్యాపింగ్‍కు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలను బలపరిచేలా తాజాగా కవిత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎలా రీయాక్ట్ కాబోతోందో చూడాలి మరి.






