Kavitha: కనీస సంస్కారం లేదు.. నంబాళ్ల కేశవరావు ఇష్యూలో కవిత ఆగ్రహం

by Prasad Jukanti |

మావోయిస్టుల మృతదేహాల్లోనూ మానవత్వం లేదా.. బీజేపీపై కవిత ఆగ్రహం

Kavitha: కనీస సంస్కారం లేదు..  నంబాళ్ల కేశవరావు ఇష్యూలో కవిత ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ కగార్ (Operation Kagaru) పేరుతో బీజేపీ దుశ్చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) విమర్శించారు. మావోయిస్టుల కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాళ్ల కేశవరావుతో (Namballa Keshavs Rao) సహా ఎన్ కౌంటర్ లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాల అప్పగింతలోనూ కనీసం మానవత్వం చూపలేదని, వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించే సంస్కారం కూడా లేని పార్టీ బీజేపీ అన్నారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్‌ (Journalist Munir) కుటుంబాన్ని మంచిర్యాలలో ఇవాళ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో మునీర్ విశేషమైన కృషి చేశారని కొనియాడారు. ఆపరేషన్‌ కగార్‌ ను ఆపాలని పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆపకుండా విధ్వంసకాండ కొనసాగిస్తోందని, బీజేపీ అనుసరిస్తున్న ఈ తీరును తాను ఖండిస్తున్నానన్నారు.

కాంగ్రెస్, బీజేపీల వైఖరి ఒక్కటే:

దళితులను అవమానించే దారుణమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిది అన్నారు. ఇటీవల జరిగిన సర్వస్వతి పుష్కరాల్లో పెద్దపల్లి ఎంపీని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని, గతంలో యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు పైన ఆసనాలపై కూర్చుంటే దళితుడైన డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్కను కింది ఆసనంలో కూర్చోబెట్టి అవమానించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ బీజేపీ ఈ రెండు పార్టీల వైఖరి సమసమాజ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. మంచిర్యాల గడ్డ పోరాటాల పటిమ ఉన్న గడ్డ అన్నారు.

Next Story