- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ గ్రూపు నుంచి కవిత PRO తొలగింపు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha)కు బీఆర్ఎస్ అధిష్టానం షాకిచ్చింది. కాళేశ్వరం(Kaleshwaram) అంశంలో పార్టీపై, ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, సంతోష్ రావులపై ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ అధికారిక వాట్సాప్ గ్రూపు నుంచి ఆమె పీఆర్వో నవీన్ కుమార్‌ను తొలగించింది. అంతేకాదు.. పార్టీ గ్రూపులో కవితకు సంబంధించిన అన్ని వార్తలను డిలీట్ చేసింది. కవితపై చర్యలు తీసుకునే అవకాశమూ ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, అంతకుముందు కవిత మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ (KCR) పక్కనున్న కొందరు చేసిన పని వల్లే ఆయనకు చెడ్డపేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందులో ఐదేళ్లపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర లేదా? అని ప్రశ్నించారు. మాజీ ఎంపీ సంతోష్, హరీశ్‌రావు వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందన్నారు. కాళేశ్వరంలో (Kaleshwaram Project) చిన్నభాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్లు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంలో జరిగిన అక్రమాలకు హరీష్ రావే మెయిన్ రీజన్ అని ఆరోపణలు చేశారు.






