- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్ 2లోగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు జూన్ 2లోగా నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని కవిత హెచ్చరించారు.

జూన్ 2లోగా ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
- ఫీజు దోపిడీ నియంత్రణకు చట్టం చేయాలి
- సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు గ్రేడ్ బీ అంటూ మోసం
- టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ అమరవీరులకు, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు జూన్ 2లోగా నెరవేర్చకపోతే మరో ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీలో చేరికల కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుత్బుల్లాపూర్ నుంచే టీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవుతుందని ధీమా వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయటం చేతకాక కేకే కమిటీ పేరుతో కాలయాపన చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టిందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చాక తామిచ్చిన పాంచజన్యం హామీలను అమలు చేస్తామన్నారు. కుత్బుల్లాపూర్‌లో 20 ఏళ్ల క్రితం నిర్మించిన అమరుల స్థూపాన్ని జూన్ 2లోగా ఆవిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. లేదంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో అమరుల స్థూపాన్ని తామే ఆవిష్కరిస్తామని హెచ్చరించారు. అలాగే.. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించాలని డిమాండ్ చేశారు.
ఫీజు దోపిడీ నియంత్రణ జరగాలంటే జూన్‌లో కచ్చితంగా ఫీజు నియంత్రణ చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని డివిజన్లలో తమ అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పారు. కుత్బుల్లాపూర్‌లో మొట్టమొదటగా జెండా ఎగురవేసుకున్నట్లే ఇక్కడి నుంచే తొలి ఎమ్మెల్యేను గెలిపించుకొని జైత్రయాత్ర ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్యం కోసం చేస్తున్న ఖర్చు కారణంగా ప్రజల ఇళ్లు గుల్లా అవుతున్న పరిస్థితి ఉన్నదన్నారు. ప్రజలకు మంచి చేయాలంటే కార్పొరేట్ స్థాయి వైద్యం, విద్యను పూర్తిగా ఉచితంగా అందించాల్సి ఉన్నదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం విషయంలో ప్రజలపై పైసా భారం పడనివ్వమని చెప్పారు. రైతులను ఈ దుర్మార్గపు, కర్కోటక ప్రభుత్వం మోసం చేస్తున్నదని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేయకపోవటంతోనే ధాన్యం కుప్పలపై రైతులు చనిపోతున్న పరిస్థితి ఉన్నదన్నారు. సన్న వడ్లకు బోనస్ ఎగ్గొట్టేందుకు గ్రేడ్ బీ అంటూ రాస్తున్నారని మండిపడ్డారు. రైతుల పక్షాన తాము పోరాడుతామని భరోసా ఇచ్చారు.






