- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: బీసి రిజర్వేషన్ల బిల్లు.. ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ వెళ్లిన కవిత అక్కడ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డి ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) డిమాండ్ చేశారు. ఈ జీవో జారీ చేసేలా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి సూచించాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) రాజ్యాంగం ప్రతిని పట్టుకుని దేశమంతటా తిరుగుతున్నారని అదే రాజ్యాంగంలో ఆర్టికల్ 243 డి ప్రస్తావన ఉందని కవిత గుర్తు చేశారు. దీని గురించి రాహుల్ గాంధీకి తెలిస్తే వెంటనే తెలంగాణ ప్రభుత్వం జీవో ఇచ్చేలా రేవంత్ రెడ్డికి చెప్పాలన్నారు. ఇవాళ ఢిల్లీలోని కాన్టిట్యూట్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన కవిత.. రాహుల్ గాంధీ దేశమంతటా కులగణనపై మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అని చెబుతున్నారు. కానీ ఇది తెలంగాణ మోడల్ కాదని కాంగ్రెస్ కరప్షన్ మోడల్ అని కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations) ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ల దగ్గరికి వస్తోందన్నారు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు లభించింది. ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉందన్నారు. 2011 యూపీఏ ప్రభుత్వం జనగణన నిర్వహిస్తే ఆ లెక్కలు ఎటుపోయాయో ఎక్కడున్నాయో ఇప్పటి వరకు ఎవరికి తెలియదన్నారు. 2014 లో యూపీఏ ప్రభుత్వం దిగిపోగానే రాహుల్ గాంధీకి ఓబీసీల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకువచ్చిందని అప్పటి నుంచి తాము అధికారంలోకి వస్తే బీసీల లెక్కలు తీస్తామంటూ రాహుల్ గాంధీ చెబుతూ వస్తున్నారన్నారు. 2014 తర్వాత కాంగ్రెస్ పార్టీ కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయని తమిళనాడు, బిహార్ లో పొత్తులో భాగంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. బీసీ గణన చేస్తామని కర్ణాటకలో 2015లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఆ లెక్కలు ఎక్కడున్నాయో ఎవరికి చెప్పడం లేదన్నారు. బిహార్ లో కూడా జనగణన చేపట్టి ఆ వివరాలు డీఫ్రిజ్ లో ఉంచారని విమర్శించారు.
బీజేపీని ఓబీసీలు క్షమించరు:
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా దోషియేనని కవిత ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులను (BC Bill) కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదన్నారు. తాను ఓబీసీనని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోడీకి ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం దక్కిందని తెలంగాణ పంపిన బిల్లును ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. తమిళనాడులు ఉన్నట్లుగా రిజర్వేషన్ సీలింగ్ పై మినహాయింపు తెలంగాణలోనూ ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఓబీసీలు ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్మువైపు చూస్తున్నారని, మాకు అధికారంలో వాటా దక్కబోతున్నదని వారంతా ఆశతో ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే ఓబీసీ వ్యక్తిని సీఎం చేస్తామని బీజేపీ ప్రకటించిందని ప్రస్తుతం సీఎం ముచ్చట చాలా దూరం ఉందని కానీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించే అవకాశం దక్కిందని ఇది చేసి చూపించాలన్నారు. అప్పుడు బీజేపీని తెలంగాణ ఓబీసీలు విశ్వసిస్తారన్నారు. రాష్ట్రం పంపిన బిల్లును కేవలం ఆమోదించి పంపించాల్సిన మాత్రమే ఉన్నా తప్పించుకోవాలని చూస్తే మాత్రం తెలంగాణ బీసీ బిడ్డలు క్షమించరన్నారు. కచ్చితంగా బీజేపీకి గుణపాఠం చెప్తారన్నారు.
నిర్ణయం తీసుకోకుంటే రైల్ రోకో తప్పదు:
తామంతా తెలంగాణ బిడ్డలం అని మాకు ఉద్యమాలు కొత్త కాదని కవిత చెప్పారు. జులై 17న రైల్ రోకో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎల్లుండి జరగబోయే తెలంగాణ కేబినెట్ లో బీసీ బిల్లుపై జీవో రాకపోయినా, కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును అమోదించి వెనక్కి పంపకపోయినా రైళ్లను కదలనిచ్చేది లేదని హెచ్చరించారు. ఓబీసీలకు రిజర్వేషన్లుకల్పించాలని కాంగ్రెస్,బీజేపీలకు విజ్ఞప్తి చేసేందుకే తాము హైదరాబాద్ నుంచి ఢిల్లీ వచ్చామన్నారు.






