Kavitha: చింతమడకకు బయలుదేరిన కవిత.. ప్రముఖ కవి నందిని సిధారెడ్డితో భేటీ

by Ramesh Naini |

సిద్దిపేట ముద్దుబిడ్డ, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారులు సిధారెడ్డితో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు.

Kavitha: చింతమడకకు బయలుదేరిన కవిత.. ప్రముఖ కవి నందిని సిధారెడ్డితో భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సిద్దిపేట ముద్దుబిడ్డ, ప్రముఖ కవి, తెలంగాణ ఉద్యమకారులు సిధారెడ్డి(Nandini Siddareddy)తో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) భేటీ అయ్యారు. సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్తూ అల్వాల్ లోని సిధారెడ్డి నివాసానికి వెళ్లిన కవిత.. వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం చాలా కార్లతో ర్యాలీగా చింతమడకకు కవిత బయల్దేరారు. సాయంత్రం చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు.

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) సొంత ఊరు చింతమడకకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలగడంతో చింతమడకకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) నియోజవర్గం కావడంతో కల్వకుంట్ల కవిత పర్యటన హాట్‌టాపిక్‌గా మారింది. కాగా, నిన్న మీడియాతో కవిత చిట్ చాట్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాగైతే కేసీఆర్ పార్టీ పెట్టే ముందు వందలమందితో చర్చలు జరిపారో ఇప్పుడు నేనూ అదే చేస్తున్నా.. నాతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదే ఉంది. తొక్కుకుంటూ పోతే దారి అదే ఏర్పడుతుంది.. అని కవిత సంచలన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కలకలం రేపుతున్నాయి.

Next Story