KA Paul: ప్రజాశాంతిలో చేరండి.. కవితకు కేఏ పాల్ ఆఫర్

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 03:56:24  IST  )

కవిత ఎపిసోడ్ పై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul: ప్రజాశాంతిలో చేరండి.. కవితకు కేఏ పాల్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత (Kavitha) భవిష్యత్ కార్యాచరణపై సర్వత్రా చర్చ జరుగుతున్న వేళ కవిత తమ పార్టీలో చేరాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆహ్వానించారు. కవిత ప్రజాశాంతి పార్టీలో (Prajashanthi Party) చేరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ మేరకు తాజాగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. తాను బీసీల తరఫున పోరాటం చేస్తున్నానని కవిత చెబుతున్నారని, కవిత చెబుతున్న మాటలు నిజమే అయితే ప్రస్తుతం బీసీల పక్షాన ఉన్న ఏకైక పార్టీ ప్రాజాశాంతిలో చేరాలన్నారు. కవిత ప్రజాశాంతి పార్టీతో చేతులు కలిపి తాను బీజేపీ వదిలి బాణం కాదని నిరూపించుకోవాలన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్, బ్రాహ్మణుల పార్టీ అని, కాంగ్రెస్ రెడ్ల పార్టీ అనే ప్రచారం ఉంది. కానీ ఒక దొరసాని నిన్ను ప్రజలు నమ్మాలన్నా మీపై ప్రజలకు ఆత్మవిశ్వాసం పెరగాలన్నా గద్దర్ చేరిన ప్రజాశాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు.

Link

Next Story