- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలు.. ఆశావహులతో కవిత కీలక భేటీ
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నేతలు బరిలో దిగుతారని కవిత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లోని తమ నివాసంలో కవిత ఆశావహులతో భేటీ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి నేతలు బరిలో దిగుతారని కవిత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నేడు హైదరాబాద్ లోని తమ నివాసంలో కవిత ఆశావహులతో భేటీ అయ్యారు. ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలపై కవిత చర్చిస్తున్నారు. కాగా ఈ ఎన్నికల్లో నిజామాబాద్ లో 20 నుండి 30 స్థానాల్లో జాగృతి అభ్యర్థులు బరిలో దిగబోతున్నట్టు తెలుస్తోంది. సింహం గుర్తుపై జాగృతి అభ్యర్థుఉ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్థులను ప్రకటించేలా కవిత కసరత్తు చేస్తున్నారు. దీంతో సింహం గుర్తును జాగృతి కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక కవిత తొలిసారిగా సొంతగడ్డపై బరిలో దిగుతుండటంతో జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకుముందు నిజామాబాద్ ఎంపీగా బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కవిత ఇప్పుడు సొంతపార్టీతో రావడంతో ఉత్కంఠ నెలకొంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్, నిజామాబాద్ లో మంచి పట్టు ఉన్న బీజేపీ అదే విధంగా తన తండ్రి పార్టీ బీఆర్ఎస్ లను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.






