గంటపాటు ఫామ్‌హౌజ్‌లోనే కవిత.. కేసీఆర్‌తో కలిసి లంచ్.. ఆ తర్వాత కీలక చర్చ!

by Gantepaka Srikanth |

తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) శుక్రవారం ఎర్రవల్లిలోని తన తండ్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళ్లారు.

గంటపాటు ఫామ్‌హౌజ్‌లోనే కవిత.. కేసీఆర్‌తో కలిసి లంచ్.. ఆ తర్వాత కీలక చర్చ!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి(Telangana Jagruti) అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) శుక్రవారం ఎర్రవల్లిలోని తన తండ్రి కేసీఆర్ ఫాంహౌజ్‌కు వెళ్లారు. తన చిన్న కొడుకు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించేందుకు అమెరికాకు వెళ్తున్న నేపథ్యంలో తాత ఆశీర్వాదం కోసం ఫాంహౌజ్ చేరుకున్నారు. అక్కడే సుమారు గంటపాటు కవిత ఉన్నారు. ముందుగా తన తండ్రితో భేటీ అయి మాట్లాడగా.. తరువాత తల్లితో మాట్లాడారు. కుమారుడిని అమెరికాలో గ్రాడ్యుయేషన్లో చేర్పించబోతున్న సందర్భంగా శనివారం అమెరికా కు వెళ్లనున్నట్లు కవిత ఆర్యలు కలిసి కేసీఆర్ దంపతుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం అక్కడే లంచ్ చేశారు. తన కుమారుడికి తాత ఆశీర్వాదం తీసుకున్న అనంతరం పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ తిరిగివచ్చారు. అయితే.. ఆమె వెళ్తున్న క్రమంలోనే హరీశ్‌రావు ఫాంహౌజ్‌కు వస్తుండడం కనిపించింది.

నేడు అమెరికాకు కవిత

చిన్న కుమారుడు ఆర్యను కాలేజీలో చేర్పించేందుకు కవిత నేడు అమెరికాకు వెళ్తున్నారు. 15 రోజులపాటు అమెరికాలో ఆమె ఉండనున్నారు. అమెరికాలోని కళాశాలలో ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో చేర్పించనుండగా.. శనివారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి అమెరికాకు ప్రయాణం కానున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని సెప్టెంబర్ ఒకటో తేదీన తిరిగి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. కాగా.. కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయస్థానం పాస్‌పోర్ట్ రిలీజ్ చేసింది.

తీజ్ వేడుకలకు హాజరు..

అలాగే.. కర్మాన్‌ఘాట్ హనుమాన్ ఆలయ సమీపంలోని పవన్‌పూరి కాలనీలో నిర్వహించిన తీజ్ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. స్థానిక బంజారా మహిళలతో కలిసి నృత్యం చేశారు.

Next Story