- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ రోజునే కవిత కొత్త పార్టీ.. ఎంపీ రఘునందన్ సెన్సేషనల్ కామెంట్స్
తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లేఖ వ్యవహారం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) లేఖ వ్యవహారం రాజకీయ రచ్చకు దారి తీస్తోంది. ఆమె రాసిన లేఖతో బీఆర్ఎస్ (BRS) పార్టీలో అంతర్గత విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని.. దొంగ ఎవరో, దొర ఎవరో తెలిసిందంటూ విపక్షాలు ఓ రేంజ్‌లో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలోనే కవిత లేఖపై బీజేపీ ఎంపీ రఘునందర్ రావు (MP Raghunandan Rao) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరే ఆలోచన చేయడం లేదని తెలిపారు. తనకు తానుగా ఓ రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తుందని కామెంట్ చేశారు.
పార్టీలో అంతర్గత విబేధాలు ఉంటే.. తండ్రీకూతుళ్లు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకొవచ్చని, అందుకు మధ్యవర్తులు అవసరం ఏంటని ప్రశ్నించారు. గెలిచినప్పుడు కేసీఆర్ (KCR) అందరికీ దేవుడయ్యాడని.. ఒక్క ఓటమి ఎదురవ్వగానే అదే కేసీఆర్ దయ్యమైండా అని సైటర్లు వేశారు. జూన్ 2న ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్‌ను విబేధించి.. పార్టీ నుంచి వైదొలిగి కొత్త పార్టీ పెట్టబోతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకు తండ్రి కేసీఆర్ కూడా పూర్తిగా సహకరిస్తారని అన్నారు. వైఎస్ షర్మిల (YS Sharmila) తరహాలోనే అన్న జగన్‌కు మద్దతుగా మొదట్లో పాదయాత్ర చేసిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కవిత కూడా పాదయాత్ర చేయబోతోందని.. అది బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులపాలు చేయనుందని ఎంపీ రఘునందన్ రావు జోస్యం చెప్పారు.






