Kavitha: కవిత ఎఫెక్ట్.. సీఎం క్యాండిడేట్ గా హరీశ్ రావు!.. వీడియో వైరల్

by Prasad Jukanti |   (  Updated:2025-09-10 03:59:08  IST  )

బీఆర్ఎస్ లో కవిత ఎపిసోడ్ చల్లారలేదు.

Kavitha: కవిత ఎఫెక్ట్.. సీఎం క్యాండిడేట్ గా హరీశ్ రావు!.. వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ (Kavitha episode) ఇంకా చల్లారలేదు. యూకే నుంచి తిరిగి వచ్చిన హరీశ్ రావు (Harish Rao) ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సాగుతున్న ఈభేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కవిత వర్సెస్ హరీశ్ రావు అభిమానుల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పరస్పరం ఎవరి గొప్పలు వారు చెప్పుకోడంతో పాటు ఎదుటివారి నైజం ఇదేనంటూ పోస్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో హరీశ్ ను ఉద్దేశించి ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

కేటీఆర్ ను ఏం చేద్దామనుకుంటున్నారు?:

తాజాగా ఓ యువతి హరీశ్ రావును ఉద్దేశించి ఓ వీడియోలో మాట్లాడుతూ నా దృష్టిలో హరీశ్ రావు మోస్ట్ ఎలిజిబిలిటీ సీఎం క్యాండిడేట్ అని కామెంట్ చేసింది. హరీశ్ రావుకు రూరల్ తెలంగాణపై మంచి పట్టుంది. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని ఒక్కడే శాసించగలరని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియోపై కవిత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోలో మాట్లాడుతున్న యువతి హరీశ్ రావు దూరపు బంధువు అని, తాను సీఎం అవుతానని హరీశ్ రావే ఇలా చెప్పించుకుంటున్నారని కౌంటర్ చేస్తున్నారు. ఈ విధంగా హరీశ్ రావు తన ప్రణాళికను అమలు చేస్తున్నారా? అని నిలదీస్తున్నారు. హరీశ్ లేకుంటే కేసీఆర్ (KTR) లేరు అని మొన్నటి వరకు చెప్పించుకున్న హరీశ్ రావు, నిన్న కేసీఆర్ కంటే ఎక్కువ హరీశ్ రావే పని చేస్తారని ప్రచారం చేయించుకుంటున్నారు. ఇప్పుడేమో ఏకంగా తాను సీఎం అవుతానని చెప్పించుకుంటున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక బీఆర్ఎస్ నేతలపై సిరీస్ రూపంలో ఆరోపణలు చేస్తున్న కవితక్క అప్ డేట్ అనే ఎక్స్ అకౌంట్ మరో సంచలన అప్ డేట్ ఇచ్చింది. రేపు స్టోరీ-3 ఉండబోతున్నదని పోస్టు చేశారు. ఇప్పటికే మొన్న సంతోశ్ రావు, నిన్న హంపీ లో బీఆర్ఎస్ నేతల టూర్ పై ఆరోపణలు చేయగా రేపు ఎవరికి సంబంధించి? ఎలాంటి సంచలనాలు బయటకు రాబోతున్నాయనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

Link

Next Story