BRS: బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు.. కేసీఆర్ ఆశలపై నీళ్లు?

by Prasad Jukanti |   (  Updated:2025-09-02 13:43:50  IST  )

రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలన్న బీఆర్ఎస్ అధినేత ఆశలపై చెక్ పడనుందా?

BRS: బీఆర్ఎస్ లో తాజా పరిణామాలు.. కేసీఆర్ ఆశలపై నీళ్లు?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలపై గంపెడాశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి జీరో సీట్లు రావడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను గెలిపించుకోవడం ద్వారా తిరిగి తమ సత్తా ఏంటో చాటుకోవాలనే ప్రణాళికలతో గులాబీ పార్టీ ఉంది. ఎన్నికలు వస్తే తమ బలం ఏంటో నిరూపిస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) పెద్దలు పలు సందర్భాల్లో అధికార పక్షానికి సవాల్ విసిరారు. ఇంతలో కవిత (Kavitha) ఎపిసోడ్ పార్టీలో బిగ్ బ్లాస్ట్ గా మారింది.

కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో త్వరలోనే కారు పార్టీలో కీలక పరిణామాలు తప్పవనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది. ఇది పార్టీకి ఇబ్బందికర పరిస్థితే. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులో హరీశ్ రావు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, కేసీఆర్ వెన్నంటి ఉండే సంతోశ్ రావు సైతం అవినీతి చేశారని కవిత ఆరోపించడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యలను ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడంతో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. లోకల్ బాడీ ఎన్నికల ముంగిట్లో కవిత బీఆర్ఎస్ కు ఎగనెస్ట్ గా ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. లోకల్ బాడీ (local elections) ఎన్నికల్లో ప్రభుత్వానికి చెక్ పెట్టాలనే బీఆర్ఎస్ ప్రణాళికలకు చిక్కులు తప్పవనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

Read More..

Kavitha: కవిత సస్పెండ్.. తెరపైకి లిక్కర్ స్కామ్!

Next Story