MLC Kavitha : బోనాల వేడుకలో కవిత డ్యాన్స్

by Muthe.Rajitha |   (  Updated:2025-05-30 12:05:05  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే.

MLC Kavitha : బోనాల వేడుకలో కవిత డ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. తమ పార్టీని బీజేపీ(BJP)తో కలపాలని చూస్తున్నారని.. ఆది తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. తాను ఉంటే కుదరదని, తనను పార్టీ నుంచి బయటకు పంపాలని చూస్తున్నారని కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వేడిని రేపాయి. పార్టీలో కేసీఆర్(KCR) నాయకత్వం తప్పా ఎవ్వరి నాయకత్వం తాను ఒప్పుకోబోనని, తన లేఖను లీక్ చేసిందే ఎవరో బయటపెట్టాలని స్పష్టం చేశారు.

కవిత వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతుండగా.. ఆమె మాత్రం ఓ వేడుకలో సరదాగా డ్యాన్స్(Kavitha Dance) చేసిన వీడియో వైరల్ అవుతోంది. మేడ్చల్(Medchal) జిల్లా శామీర్పేట మండలం సేవాలాల్ మల్లన్న తండాలో కవిత నేడు పర్యటించారు. భోగ్ బండారా వేడుకల్లో(Bhog Bandara Celebrations) తలకు బంజారా టోపీ ధరించి డప్పు చప్పుళ్లకు అనుగుణంగా డ్యాన్స్ చేశారు. స్థానికులతో కలిపి కాలు కదిపిన కవిత డ్యాన్స్ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story