నీ బాగోతం అంతా ఆధారాలతో బయటపెడతా... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కవిత కౌంటర్

by Prasad Jukanti |

మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు.

నీ బాగోతం అంతా ఆధారాలతో బయటపెడతా... బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కవిత కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తనను ఉద్దేశించి కూకట్‍పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. కృష్ణారావు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఆయన ఫ్రస్ట్రేషన్‍ను బయట పెడుతోందన్నారు. ఆయన చేసిన అన్ని ఆరోపణలకు రెండు మూడు రోజుల్లో మీడియా సమక్షంలోనే ఆధారాలతో సహా వివరణ ఇస్తానన్నారు. ఇవాళ బోయినపల్లిలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కృష్ణారావు ఆయన మాటలన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఆయన మాటలకు ఫీలయ్యేది లేదన్నారు. కూకట్‍పల్లి 15 ఏళ్లుగా ఉన్న సమస్యలనే నేను చెప్పాననని

రాష్ట్రంలో పాలక పక్షం, ప్రతిపక్షం పనిచేయడం లేదని జనం గళంగా జాగృతి పనిచేస్తోందన్నారు. జాగృతి జనం బాటలో భాగంగా ఐదు రోజుల పాటు హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తామని ఇవ్వాళ మనం కంటోన్మెంట్‍లోని బోయినపల్లి గవర్నమెంట్ స్కూల్‍ను పరిశీలించామన్నారు. టాప్‍టెన్ విద్యార్థులకు మా తరఫున స్కాలర్‍షిప్‍లు సైతం ఇస్తామన్నారు. ఏ జిల్లాకు వెళ్లిన ప్రజల నుంచి ఆదరణ, సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటోందని ప్రజల సమస్యలను వీలైనంతగా మేము పరిష్కరిస్తామన్నారు.

గత ప్రభుత్వంలో నన్ను నిజామాబాద్‍కే పరిమితం చేశారని అందువల్ల అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో చూడలేదన్నారు. తెలంగాణ వచ్చాక ఏం జరిగింది. ఏం జరగలేదన్నది జనం బాట కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. మేము చేయగలిగేవి చేస్తాం. మిగిలిన సమస్యలపై ప్రభుత్వం‍పై ఒత్తిడి తెస్తామని చెప్పారు. మంచిని మంచి, చెడును చెడు అనే అంటామన్నారు. జనం బాటలో భాగంగా విద్య, వైద్యం మీద ఫోకస్ పెట్టామని స్కూల్స్, హాస్పిటల్స్ లో మౌలిక వసతులు ఎలా ఉన్నాయన్నది పరిశీలిస్తున్నామన్నారు. ఇండ్లు, ఇళ్ల పట్టాలను లేని వారి సమస్యలు కూడా తెలుసుకుంటున్నాం. మా వరకు చేయగలిగేది మేము ఒక సంస్థగా చేస్తామన్నారు.

మాధవరం ఏమన్నారంటే?

అంతకు ముందు కూకట్ పల్లి ఎమ్మెల్యే భూముల కబ్జాలకు పాల్పడుతున్నారని కవిత చేసిన వ్యాఖ్యలకు నిన్న ఆయన స్పందించారు. తాను కవిత కబ్జాల చిట్టా విప్పితే దారుణంగా ఉంటుందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు నీ అక్రమాలు, నీ మొగుడి అక్రమాలు బయటకు తీస్తే తట్టుకోలేరని ఇకనైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బంద్ చేసి ప్రజా సేవ చేయడం నేర్చుకో అన్నారు. నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూశానని నీకు ఎవడు భయపడతాడు అంటూ ఓ రేంజ్ లో కౌంటర్ ఇచ్చారు. బట్టల షాపులు, బంగారం షాపులు వదలని నీవు నన్ను కబ్జాతారుడని అంటావా అంటూ ఫైర్ అయ్యారు.

Next Story