Kavitha: మీ ఆటలు సాగవు.. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కవిత కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-02-17 09:25:22  IST  )

సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కవిత కౌంటర్ ఇచ్చారు.

Kavitha: మీ ఆటలు సాగవు.. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కి కవిత కౌంటర్
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: బీసీ కులగణన (BC Caste Census Survey) అంశాన్ని దృష్టి మరల్చడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) మండిపడ్డారు. కుల సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను పక్కదోవపట్టించడానికి మోడీ బీసీనా కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెరలేపారని దాంతో రాహుల్ గాంధీది ఏ మతమని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం తిట్టుకుంటూ ప్రజలను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు.

వాళ్ల కులం, మతం ఏదైతే మాకేంది?

మోడీ (Narendra Modi) బీసీ అయితేంది కాకపోతేంది ? రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఏ మతమైతే మాకేందీ ? బీసీల జనాభాను సరిగ్గా లెక్కబెట్టాలన్నదే మా డిమాండ్ అని కవిత అన్నారు. కాంగ్రెస్ అసెంబ్లీలో బిల్లు పెట్టాలి, బీజేపీ కేంద్రంలో దాన్ని ఆమోదించాలి. ఇవి చేయకుండా మోడీ, రాహుల్ కులమతాల గురించి ప్రజలకు ఎందుకు? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కలిసి ప్రజలను అవమానిస్తున్నాయని తెలంగాణ చాలా రాజకీయ కుట్రలు చూసిందని ఇక ఈ రెండు పార్టీల కుట్రలు ఇక్కడ నడవవన్నారు. బీసీ బిడ్డలను మోసం చేయవద్దని కాంగ్రెస్, బీజేపీ పార్టీలను హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి వంకర టింకర మాటలతో ప్రజలను ఆగం చేస్తున్నారు. ఏ ఒక్క అంశానికి, సమస్యకు ఇప్పటి వరకు సీఎం పరిష్కారం చూపలేదన్నారు.

మరింత శక్తితో కేసీఆర్ వస్తారు:

తన ప్రాణాన్ని పణంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించిన ధీరుడు కేసీఆర్ అని తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ (KCR) ను తలవని గుండె లేదన్నారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ జన్మదినం సందర్భంగా పూజలు చేస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు కాబట్టే కేసీఆర్ ను ప్రజలు ఆరాధిస్తున్నారన్నారు. అందరి ఆశీర్వాదంతో మరింత శక్తియుక్తులతో కేసీఆర్ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నరకం చూపిస్తోందని విమర్శించారు.

Next Story