మైనర్లపై జరుగుతున్న దాడులపై రేవంత్ రెడ్డి స్పందించాలి: కవిత

by Prasad Jukanti |

ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

మైనర్లపై జరుగుతున్న దాడులపై రేవంత్ రెడ్డి స్పందించాలి: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖమ్మంలో 12 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం ఘటనలో నిందితుడిని ఉరి తీసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. అత్యాచార ఘటనలో తీవ్రంగా గాయపడి నిమ్స్ లో చికిత్స పొందుతున్న చిన్నారిని ఇవాళ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె.. మైనర్లపై రోజూ దారుణాలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఇటువంటి దారుణాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనలో నిందితుడిని ఉరితీసి బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అలాగే బాలికకు నెలకు రూ.50 వేల పించన్, తల్లిదండ్రులకు ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Next Story