నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు

by Vemula.Srinu Prasad |

ఇటీవల ప్రవేశించిన నైరుతి రుతుపవనాల ప్రభావం రాష్ట్రంపై పడిందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుందని, తద్వారా ఆదివారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది..

నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్: రేపు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల ప్రవేశించిన నైరుతి రుతుపవనాల(Southwest monsoon) ప్రభావం రాష్ట్రంపై పడిందని వాతావరణ శాఖ(Meteorological Department) స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలో వాతావరణం(Weather) ఒక్కసారిగా మారిపోతుందని, తద్వారా ఆదివారం పలు జిల్లాల్లో పిడుగుల(Thunder Storms)తో కూడిన వర్షాలు(Rains) పడతాయని హెచ్చరించింది. మొత్తం 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. అయితే వర్షం పడే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత వాసులు ఎత్తు ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద పడే అవకాశం ఉందని, కాబట్టి వాటి కిందకు వెళ్లొద్దని సూచించారు. మరోవైపు విద్యుత్ స్తంబాలు సైతం ఒరిపోయే అవకాశం ఉందని, అలాగే వైర్లు సైతం తెగి పడే అవకాశం ఉందని, వాటిని గమనించి దూరంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తత జారీ చేసింది.

Next Story