భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్.. అత్యవసర సమీక్షలో కీలక ఆదేశాలు

by Prasad Jukanti |   (  Updated:2026-06-13 12:32:09  IST  )

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి హై అలర్ట్..  అత్యవసర సమీక్షలో కీలక ఆదేశాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వర్షాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, క్షేత్రస్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (Core Urban Region) పరిధిలో 'హై అలర్ట్' ప్రకటించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, యుద్ధ ప్రాతిపదికన వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సమన్వయంతో పని చేయాండి:

వర్షాలపై వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ముందస్తు ప్రణాళికతో రోడ్లపై నీరు నిలిచే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేకంగా బృందాలను మోహరించి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని శాఖల మధ్య సమన్వయంతో పని చేసుకోవాలని సూచించారు. రోడ్లపై నీరు నిలిచే లోతట్టు ప్రాంతాలను గుర్తించి, అక్కడ ముందస్తుగా విపత్తు నిర్వహణ బృందాలను మోహరించాలని సూచించారు. హైడ్రా (HYDRAA), విద్యుత్ శాఖ, వాటర్ బోర్డ్, మున్సిపల్, పోలీస్ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ ట్రాఫిక్ మళ్లింపు, విద్యుత్ పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS), డీజీపీ (DGP) మరియు క్యూర్ (CUR) స్పెషల్ సీఎస్‌లు వ్యక్తిగతంగా ఈ పరిస్థితిని పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు.

Next Story