మిర్చి గ్రేడింగ్‌లలో బాల కార్మికులు.. ముగ్గురు యజమానులపై కేసు

by Vemula.Srinu Prasad |

కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ శనివారం మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించారు..

మిర్చి గ్రేడింగ్‌లలో బాల కార్మికులు.. ముగ్గురు యజమానులపై కేసు
X

దిశ, గుంటూరు ప్రతినిధి: కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్‌మెంట్, చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ శనివారం మిర్చి యార్డు పరిధిలోని మిర్చి గ్రేడింగ్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆరుగురు బాల కార్మికులను గుర్తించి స్కూల్‌కు వెళ్ళే ఏర్పాట్లు చేశారు. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు చేశారు. బాల కార్మికులు ఎక్కడైనా ఉంటే వెంటనే ఈ నెంబర్లకు 1098, 9492555157 సమాచారం అందించాలని అధికారులు సూచించారు. ఈ తనిఖీలలో డిప్యూటీ లేబర్ కమిషనర్ గాయత్రి దేవి, ఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాసంతి, చైల్డ్ లైన్ డిపార్ట్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.

Next Story