- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా బాగుంది.. అభినందించిన కవిత
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా బాగుంది.. అభినందించిన కవిత

దిశ, వెబ్‌డెస్క్: రాజు వెడ్స్ రాంబాయి చిత్రబృందాన్ని(Raju Weds Rambai Movie) తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అభినందించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో సినిమా నిర్మాత వేణు ఉడుగుల, దర్శకుడు సాయిలు కంపాటి, ప్రెజెంటర్ పూజారి నాగేశ్వర్ రావు, లిరిక్ రైటర్ మిట్టపల్లి సురేందర్, మ్యూజిక్ డైరెక్టర్ సురేశ్ బొబ్బిలి, నటుడు ఆదిత్య, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మురళీ పున్న తదితరులు కల్వకుంట్ల కవితను కలిశారు. మంచి సక్సెస్ సాధించిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా కవిత ఆకాంక్షించారు. కాగా, చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. గత నెల 21న థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. డిసెంబరు 18వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ (raju weds rambai movie ott) కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఈటీవీ విన్ పోస్టర్ పంచుకుంది. ఫొటోస్






