కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ నుంచి పంపించారు: కవిత

by Ajay Maddhiboyina |

కుట్ర‌లో భాగంగానే త‌న‌ను బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేశార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అన్నారు. కామారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. త‌మ కుటుంబంలో ఉద్యమం,

కుట్రలో భాగంగానే నన్ను బీఆర్ఎస్ నుంచి పంపించారు: కవిత
X

దిశ‌, వెబ్ డెస్క్: కుట్ర‌లో భాగంగానే త‌న‌ను బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం చేశార‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత అన్నారు. కామారెడ్డి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా క‌విత మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. త‌మ కుటుంబంలో ఉద్యమం, రాజ‌కీయం, పార్టీ.. అన్నీ క‌లిసిపోయాయ‌ని చెప్పారు. అందుకే త‌న త‌ల్లిదండ్రుల‌ను దూరం చేసినా మ‌రో కుటుంబం అనుకునే తెలంగాణ కుటుంబం కోసం పోరాడ‌తాన‌ని అన్నారు. తాను జైలులో ఉన్న‌ప్పుడు ఎక్కువ‌గా ఆలోచించింది త‌న త‌ల్లి గురించే అన్నారు.

త‌న పిల్ల‌ల కంటే ఎక్కువ త‌న త‌ల్లి ఆరోగ్యం గురించే ఆలోచించేదాన‌ని అన్నారు. కానీ ఇప్పుడు వాళ్ల నుండే తన‌ను దూరం చేశార‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు. ఆడ‌పిల్ల‌గా త‌న‌కు బాధ ఉంటుంద‌ని కానీ త‌న మ‌రో పెద్ద కుటుంబం ఉంద‌న్నారు. అదే తెలంగాణ అని రాష్ట్రం బాగోగులు చూసుకునేందు, స‌మ‌స్య‌ను నెర‌వేర్చ‌డానికి త‌న ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు. మ‌రో కుటుంబాన్ని తెలంగాణ‌లోనే వెతుక్కున్నాన‌ని, బాధ‌పడినా అంత‌కంటే ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పారు.

Next Story